సత్తేనపల్లి

మహిళలకుఅధిక ప్రాధాన్యత ఇచ్చిన పార్టీ వైస్సార్ కాంగ్రెస్ పార్టీ…వైసీపీ నేత అంబటి రాంబాబు

👉 స్వర్గీయ డాక్టర్ వైస్ రాజశేఖర్ రెడ్డి మహిళలకు పెద్ద పీట వేశారు…. సత్తెనపల్లి వైసీపీ ఇంఛార్జి
అంబటి రాంబాబు.

👉వైస్సార్ కాంగ్రెస్ పార్టీ ని నడిపింది..ఇద్దరు మహిళలే..వైస్ విజయమ్మ,షర్మిల..అంబటి

👉వైస్సార్ నవరత్నాల సంక్షేమ పథకాలు..ప్రజల జీవితాల్లో వెలుగు నింపుతాయి..అంబటి రాంబాబు

👉ఆరోగ్య శ్రీ,తదితర సంక్షేమ పథకాలు అమలు కావాలంటే…వైసీపీ అధికారంలోకి రావాలి.. మహిళ అధ్యక్షురాలు..డాక్టర్ గీత హాసంతి

👉వైకాపా ఆధ్వర్యంలో….అట్టహాసంగా మహిళ దినోత్సవ వేడుకలు

మారుతి న్యూస్ సత్తెనపల్లి

స్వర్గీయ డాక్టర్ వైస్ రాజశేఖర్ రెడ్డి మహిళకు ప్రాధాన్యత ఇచ్చారు..మహిళ రిజర్వేషన్లు, మహిళ సంక్షేమ పథకాలు కు పెద్ద పీట వేశారని…వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి,సత్తెనపల్లి సమన్వయ కర్త అంబటి రాంబాబు అన్నారు..
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుక్రవారం రోజు సత్తెనపల్లి పట్టణంలో వైసీపీ పార్టీ కార్యయాలంలో..మహిళ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు..
ఈ కార్యక్రమంలో.. మహిళలు అధికంగా పాల్గొన్నారు..

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో వైసీపీ నేత అంబటి రాంబాబు మాట్లాడుతూ

.. వైస్సార్ నవరత్నాల సంక్షేమ పథకాలు.. ప్రజల జీవితాల్లో వెలుగును నింపుతాయని అంబటి అన్నారు…వైస్సార్ హయాంలో..మహిళ రిజర్వేషన్లు, మహిళ సంక్షేమ పథకాలుకు పెద్ద పీట వేశారని అంబటి తెలిపారు…వైస్సార్
పార్టీ ని నడిపింది కూడా..ఇద్దరు.. మహిళలు లే వైస్ విజయమ్మ, షర్మిలమ్మ, అని ఈ సందర్భంగా అంబటి గుర్తుచేశారు….తెదేపా పాలనలో మహిళలు కు రక్షణ కరువు అయ్యిందని.. అంబటి తెదేపా ను విమర్శించారు..

👉పార్లమెంటరీ మహిళ అధ్యక్షురాలు డాక్టర్ గీత హాసంతి మాట్లాడుతూ..

డాక్టర్ వైస్సార్ రాజశేఖర్ రెడ్డి హయాంలో..ఆరోగ్య శ్రీ…పథకంలో…మహిళలు కు ప్రాధాన్యత కల్పించారు అని హాసంతి అన్నారు…ప్రజలు జీవితాల్లో వెలుగు నింపాలన్న…సంక్షేమ పథకాలు అమలు చేయాలన్న…..వైసీపీ అధికారంలో కి రావాలని…గీత హాసంతి అన్నారు..మహిళలు వైసీపీ కీ అండగా ఉండాలని ఆమె కోరారు…

👉డాక్టర్ షకీలా మాట్లాడుతూ…

సమాజంలో …ఇప్పటికి మహిళ వివక్ష కు గురిఅవుతుందని..మహిళ సాధికారత,మహిళ సమానత్వం.. రావాలంటే..మహిళల్లో చైతన్యం రావాలన్నారు..

తొలుత….నరసరావుపేట పార్లమెంటరీ అధ్యక్షురాలు గీత హాసంతి ఆధ్వర్యంలో..సత్తెనపల్లి పట్టణంలో మహిళ ర్యాలీ నిర్వహించి..తదుపరి…వైసీపీ పార్టీ కార్యలయం వద్ద..సత్తెనపల్లి నియోజకవర్గ మహిళ సదస్సు నిర్వహించి…తదుపరి..మహిళలు అందరూ…’యాత్ర’ సినిమా చూసినట్లు..డాక్టర్ గీత హాసంతి.. తెలిపారు..ఈ కార్యక్రమనికి సత్తెనపల్లి నియోజకవర్గ వైసీపీ మహిళ నేతలు, వైసీపీ మహిళ కార్యకర్తలు, మహిళలు హాజరయ్యారు..