గుంటూరు

తెలుగుదేశం పార్టీని తాకే సత్తా ఢిల్లీ పెద్దలకు లేదు -టీడీపి రాష్ట్ర కార్యదర్శి రాయపాటి రంగరావు

గుంటూరు మారుతి న్యూస్..

 ఢిల్లీని ఎదిరించి,  తెలుగు వారి ఆత్మ గౌరవానికి చిహ్నంగ పుట్టినపార్టీ  తెలుగుదేశం అని దానిని తాకే సత్తా ఢిల్లీకి లేదని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి రంగరావు పేర్కొన్నారు. ఈ సందర్భంగా శనివారం నాడు ఆయన గుంటూరు లో ఒక పత్రిక ప్రకటనను విడుదల చేశారు.

రాయపాటి రంగరావు మాట్లాడుతూ…

గతంలో ఢిల్లీ ని ఎదిరించి తెలుగువారి  ఆత్మ గౌరవాన్ని అన్న ఎన్టీఆర్  కాపాడితే,మరల అదే పరిస్థితి నెలకొన్న వేళ చంద్రబాబు ఢిల్లీ వెళ్లి తోడగొడితే, ఆ దెబ్బకు ప్రధాని స్థాయిలో ఉన్న మోడీ ప్రతి నెల ఢిల్లీ నుండి ప్రత్యేక  విమానంలో ఆంద్రప్రదేశ్ కు వచ్చి తన ఆవేదనను వేళ్ళగక్కితే మోడీ మొసలి కన్నీరు ను నమ్మటానికి ఆంధ్రప్రజలు సిద్దంగా లేరన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ముగ్గురు మోడీలలో ఓటమి భయం స్పష్టంగా కనిపిస్తోందని దీనికి వారు చేస్తున్న కుట్రలే నిదర్శనమని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. అడ్డదారిలో అధికారంలోకి  వచ్చేoదుకు వారు ప్రజాస్వామ్యన్ని కూడా ఖునీ చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. తెలంగాణలోని తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఉండే ఒక ఐటీ కంపెనీని 30 మంది తెలంగాణ పోలీసులు చుట్టు ముట్టి తెల్లవారుజాము వరకు సోదాలు జరిపి  ఎటువంటి సమాచారం దొరకక పోవటంతో కొంతమంది ఉద్యోగులను అరెస్టు చేసి వారి కుటుంబ సభ్యులను సైతం అరెస్టు చేసి రాక్షసఆనందం పొందుతున్నారని, ఢిల్లీలోని మోడీ నేతృత్వంలో  స్క్రిప్ట్ తయారు చేసి తెలంగాణలో కేసిఆర్, ఆంధ్రప్రదేశ్ లో జగన్ ద్వారా ఇటువంటి నీచమైన సాంస్కృతికి బీజేపీ తెరలేపటం, దీనికి జగన్, కేసీఆర్ మద్దతు తెలపటం ద్వారా ప్రజాకేష్ట్రంలో వారిని దోషులుగా నిలబెట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు