పెద్దకూరపాడు

రాజన్న పాలన రావాలంటే..జగనన్న సీఎం కావాలి.. పెదకూరపాడు నియోజకవర్గ సమన్వయకర్త నంబూరు శంకర రావు

మారుతి న్యూస్ పెదకూరపాడు

పెదకూరపాడు మండలం పాటిబండ్ల గ్రామానికి చెందిన 40 కుటుంబాల ముస్లిం నాయకులు శుక్రవారం టిడిపి నుంచి నియోజకవర్గ సమన్వయకర్త నంబూరు శంకర్రావు సమక్షంలో వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ లో చేరారు…
పార్టీలో చేరిన వారిలో కలాం,మహమ్మద్,మస్తాన్,సద్దాం,షేక్.జాన్ పేరా,శుభాని,రవి, కఫీర్ షార్,మహమ్మద్ వీరితో పాటు 40కుటుంబాలవారు నవరత్నాల పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు,పార్టీ బలోపేతానికి తమవంతు కృషి చేస్తామని తెలిపారు….

👉ఈ సందర్భంగావైసీపీ పెదకూరపాడు సమన్వయ కర్త నంబూరు శంకర్రావు మాట్లాడుతూ..

నాలుగు శాతం ముస్లిం మైనార్టీలకు రిజర్వేషన్ కల్పించిన ఏకైక ముఖ్యమంత్రి దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి అని,మ్యానిపొస్ట్లో లేని హామీలు ఎన్నో ఆయన చేసి నిరూపించారని,మళ్లీ అలాంటి రాజన్న పాలన రావాలంటే జగన్మోహన్ రెడ్డినీ సిఎం చేసుకోవాలని పిలుపునిచ్చారు,తెలుగుదేశం ప్రభత్వం 600హామీలు ఇచ్చి ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదని,డ్వాక్రా రుణ మాఫీ,రైతు రుణమాఫీ,నిరుద్యోగ భృతి అంటూ దొంగ హామీలు ఇచ్చారని,ఇంకోసారి టిడిపికి ఓటు వేసి మోసపోవద్దని పేర్కొన్నారు.

.ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షుడు అల్లం కిషోర్ రెడ్డి,మండల మైనార్టీ సెల్ సెక్రటరీ పఠాన్ యూసఫ్,మండల యూత్ అధ్యక్షులు షేక్.రహమత్,షేక్.కలాం, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు….