సత్తేనపల్లి

రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం… సభాపతి కోడెల, యువనాయకులు కోడెల శివరాం

మారుతి న్యూస్ సత్తెనపల్లి

అన్నదాత సుఖీభవ పథకం కింద పెట్టుబడి సాయం రూ.9వేలు ప్రతి రైతు కుటుంబానికి ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకున్న సంచలన నిర్ణయం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా రైతుల నుండి హార్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.ఈ సందర్భంగా సత్తెనపల్లిలో బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబుకు ధన్యవాదాలు తెలుపుతూ “అన్నదాత సుఖీభవ” కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా ఏపి స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు, యువనాయకులు డాక్టర్ కోడెల శివరామ్ లు పాల్గొన్నారు…ముందుగా పార్టీ కార్యాలయం నుండి ఐదు లాంతర్ల సెంటర్ అచ్చంపేట రైల్వే గేటు వావిలాల ఘాట్, ఎన్టీఆర్ పార్కు తాలూకా సెంటర్ మీదుగా మార్కెట్ యార్డు వరకు ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహించారు.గ్రామాల నుండి తరలివచ్చిన‌ రైతులు పార్టీ నాయకులు,మహిళలు,కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు.
.అనంతరం సత్తెనపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో జరిగిన బహిరంగ సభలో స్పీకర్ కోడెల శివప్రసాదరావు మాట్లాడుతూ

ఈ ప్రభుత్వం రైతుసంక్షేమానికి కట్టుబడి ఉందని… ముఖ్యమంత్రి చంద్రబాబు రైతులుకు ఏ రాష్ట్రంలో చేయని విధంగా.. రుణమాఫీ చేసారని రైతులుకు అన్ని విధాలుగా అండంగా వున్నారని సభాపతి అన్నారు…ప్రస్తుతం ప్రవేశపెట్టిన..అన్నదాత సుకీభవ పథకం రైతుల జీవితాల్లో ఆనందం నింపుతుంది అన్నారు…సత్తెనపల్లి నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశానని సభాపతి అన్నారు..

యువనేత డాక్టర్ కోడెల శివరాం మాట్లాడుతూ….
రాష్ట్రంలోనే…చెత్తాన్ని కూడా వదలకుండా చెత్త రాజకీయాలు చేస్తున్న వ్యక్తి అంబటి రాంబాబు అని విమర్శించారు..డాక్టర్ కోడెల గారు సత్తెనపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తుంటే….అంబటి రాంబాబు రాజకీయాలు చేస్తున్నారన్నారు..ఈ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని శివరాం అన్నారు…
ఈ కార్యక్రమంలో… మునిసిపల్ చైర్మన్ యెల్లినేడి రామస్వామి,సత్తెనపల్లి నియోజకవర్గ తెదేపా నేతలు.అధికారులు.రైతులు పాల్గొన్నారు…