పెద్దకూరపాడు

బీసీలకు పూర్తిన్యాయం వైస్సార్ కాంగ్రెస్ పార్టీ తోనే సాధ్యం… నరసరావుపేట పార్లమెంట్ సమన్వయకర్త లావు కృష్ణా దేవరాయ,పెదకూరపాడు నియోజకవర్గ సమన్వయకర్త నంబూరి శంకర రావు

మారుతి న్యూస్ పెదకూరపాడు

బీసీలను ఇప్పటివరకు తెలుగుదేశం ప్రభుత్వం ఓటు బ్యాంకింగ్ గా చూడటం తప్ప వారికి ఏటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేయలేదు. గత నాలుగున్నర సంవత్సరాల నుంచి ఏమీ చేయని ప్రభుత్వం ఇప్పుడు బీసీల మీద కపట ప్రేమ చూపిస్తుందని నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ కృష్ణ దేవరాయలు అన్నారు, ఈరోజు క్రోసూరు వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ లో ప్రెస్ మీట్ నిర్వహించారు. వారు మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం బీసీలకు 47,000 కోట్లకుగాను 13 వేల కోట్లు ఖర్చు చేసింది, ఒసీలను బీసీలుగా, బీసీలను ఎస్సీలుగా, ఎస్టీలుగా మారుస్తానని ఇలా ఎన్నో అబద్ధపు హామీలు ఇచ్చారని అన్నారు,
బీసీలను ఎలా గౌరవించాలి ఎలా వారిని ఉన్నత స్థాయిలో ఉంచాలి అని జగన్మోహన్ రెడ్డి బిసి సబ్ప్లాన్ కింద సంవత్సరానికి 15 వేల కోట్ల రూపాయలు 5 సంవత్సరాలకు గాను 75 వేల కోట్ల రూపాయలు ఇస్తామని, తెలుగుదేశం ప్రభుత్వం బీసీలకు అండ అని తెలుగుదేశం ప్రభుత్వానికి చెప్పుకునే వారు సచివాలయం సాక్షిగా నాయి బ్రాహ్మణులను మీరే మాట్లాడుతున్నారు, ఎక్కువగా మాట్లాడితే తోకల కత్తిరిస్తామని సాక్షాత్తు చంద్రబాబునాయుడు అనడం బిసీ లను ఎంతగా గౌరవిస్తున్నారో అని అర్థమవుతుందని వారు ఎద్దేవా చేశారు,

నియోజకవర్గ సమన్వయకర్త నంబూరు శంకర్రావు మాట్లాడుతూ చిరు వ్యాపారులకు జీవనం కొనసాగించడానికి, సంవత్సరానికి పదివేల రూపాయలు వడ్డీ లేని రుణాలు ఇస్తామని అలాగే బీసీలకు సంబంధించిన 139 కులాలకు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని వారికి నిధులు కేటాయిస్తామని నిన్న జరిగిన బీసీ గర్జనలో జగన్మోహన్ రెడ్డి తెలపడం సంతోషకరమని అన్నారు, నిన్న జరిగిన బీసీ గర్జనలో జన స్పందన చూసి బీసీలు ఈసారి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా మద్దతిస్తారని తెలుస్తుంది,చంద్రబాబు చేసిన మోసాలను బీసీలు గుర్తించి ముఖ్యంగా పెదకూరపాడు నియోజకవర్గంలో నీ ప్రతి గ్రామంలో బీసీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి స్వచ్ఛందంగా వారికి వారే పార్టీలో చేరుతున్నారని అన్నారు, బీసీలకు పూర్తి న్యాయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తోనే సాధ్యమవుతుందని చంద్రబాబును నమ్మి మరొకసారి మోసపోవద్దని ఆయన పేర్కొన్నారు…నిన్న ఏలూరులో జరిగిన బీసీ గర్జనను జయప్రదం చేసిన బీసీ నాయకులకు, వై ఎస్ ఆర్ సి పి కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు.. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ షేక్ సయ్యద్ అబ్దుల్ రహీం, పార్లమెంటరీ పార్టీ మైనార్టీ అధ్యక్షులు షేక్.సయ్యద్ మహబూబ్ , జిల్లా కార్యదర్శి ఈదా సాంబిరెడ్డి , వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు…


చేయూత పథకం క్రింద ఎస్ సి, ఎస్టి, మైనార్టీల మహిళలందరికీ సంవత్సరానికి 15 వేల రూపాయలు, ఐదు సంవత్సరాలకు గాను 75 వేల రూపాయలు లబ్ధి చేకూరుతుందని నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త లావు శ్రీ కృష్ణ దేవరాయలు అన్నారు, ఈరోజు క్రోసూరు మండలం పెరీకపాడు గ్రామంలో సుమారు 165 ఎస్ టి కుటుంబాల, 5 కుటుంబాల ఎస్ సిలకు 500 మంది టిడిపి పార్టీకి రాజీనామా చేసి నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ కృష్ణ దేవరాయలు, నియోజకవర్గ సమన్వయకర్త నంబూరు శంకర్రావు సమక్షంలో సబ్ద సపుతు నాగేశ్వర నాయక్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కి చేరారు.. జన్మభూమి కమిటీలు ఏర్పాటు చేసి ప్రజాస్వామ్య పరంగా ఏర్పాటైన ప్రజాప్రతినిధులవ్యవస్థను నిర్వీర్యం చేసి కేవలం కొంతమంది తెలుగుదేశ కార్యకర్తల కు,నాయకులకు లబ్ధి చేకూరేలా సంక్షేమ పథకాలు ఏర్పాటు చేశారని నరసరావుపేట పార్లమెంటు నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ కృష్ణ దేవరాయలు అన్నారు, రాజశేఖర్ రెడ్డి హయాంలో కులమతాలకు, పార్టీలు చూడకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించారని మళ్లీ అటువంటి రోజులు రావాలంటే వైయస్ జగన్మోహన్ రెడ్డి నీ ముఖ్యమంత్రిగా చేయాలని కోరారు…


నియోజకవర్గ సమన్వయకర్తనంబూరు శంకర్ రావు మాట్లాడుతూ ఈ గ్రామంలో రోడ్లు, మంచినీటి వసతి, డ్రైనేజీ, ఇల్లు, ఇతర సంక్షేమ పథకాలు ఏ ఒక్కరికి చేరలేదని,వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేరుస్తూ అని తెలిపారు పార్టీలో చేరిన ఎస్సీ ఎస్టీ 165 కుటుంబాలవారిని ఆయన పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ షేక్ సయ్యద్ అబ్దుల్ రహీం అధ్యక్షత వహించగా, మండల పార్టీ ఎస్టీ సెల్ కన్వీనర్ కొజ్జా రామ్ ఆంజనేయులు, బీసీ సెల్ గంజి పోయిన శ్రీనివాసరావు, మైనార్టీ సెల్ షేక్ ఇమామ్ హుస్సేన్, స్థానిక నాయకులు గ్రామ పార్టీ అధ్యక్షుడు రమణా నాయక్, భయ వరపు మస్తాన్ రావు, శ్రీ రామ్ శెట్టి శ్రీను, కృష్ణయ్య, చింతకుంట్ల భాస్కర్, మహిళా నాయకురాలు కామేశ్వరి బాయ్, తదితరులు పాల్గొన్నారు…..


పార్టీలో చేరిన ముఖ్య నాయకులు… ఆవులవారి పాలెం నుంచి అల్లరి ప్రసాద్ (టిడిపి నాయకుడు), సబ్దా సాపుతు నాగేశ్వరరావు నాయక్, బాణావతు బాలాజీ నాయక్, ఎస్ రాంబాబు నాయక్, బి కర్ణ సింగ్ నాయక్, కొర్ర బాల కోట నాయక్, మాజీ సర్పంచ్ ఆముదాల పాటి ముత్తయ్య, మందా ఏబు,…చేరారు..