సత్తేనపల్లి

ఒక్కరోజు ఓటేసినందుకు…ఓ కూలీలా సత్తెనపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసినవ్యక్తి… స్పీకర్ కోడెల…..యువనేత కోడెల శివరాం…

👉సత్తెనపల్లి రూపురేఖలు మార్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిన వ్యక్తి..స్పీకరు కోడెల…యువనేత శివరాం

👉 సత్తెనపల్లి పట్టణంలో 21 వార్డ్ లో నివేశాన స్థలాలకు 3 నెలల్లో పరిష్కరం… యువనేత కోడెల శివరాం

👉సత్తెనపల్లి నుండి..స్పీకర్ కోడెల శివప్రసాదరావు..భారీ మెజారిటీతో గెలిపించాలి…శివరాం మరియు తెదేపా నేతలు…
👉సత్తెనపల్లి పట్టణంలో 21 వార్డులో..బీసీ కమ్యూనిటీ హల్ శంకుస్థాపన చేసిన యువనేత డాక్టరు కోడెల శివరాం..
👉21వార్డ్ లో పెన్షన్ల, మౌలిక సదుపాయాల.. తదితర అభివృద్ధి కార్యక్రమాలు..స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు వల్లనే సాధ్యమైంది….21 వార్డ్ కౌన్సిలర్ కౌత్రపు సావిత్రి శ్రీనివాస్

మారుతి న్యూస్ సత్తెనపల్లి

నాలుగున్నర సంవత్సరాలుగా నమ్మినవారికి అండగా ఉంటూ, అడగకకుండానే అవసరమైన అభివృద్ధి పనులను చేస్తూ, తనను నమ్మి ఓటేసి గెలిపించి అధికారాన్ని కట్టబెట్టిన ప్రజలందరి రుణం తీర్చుకునేందుకు ఎపి స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు ఒక కూలీలాగా పనిచేస్తున్నారని నియోజకవర్గ యువనాయకుడు డాక్టర్ కోడెల శివరామ్ పేర్కొన్నారు. శనివారం సత్తెనపల్లి పట్టణంలోని 21 వవార్డులో  బీసీ కమ్యూనిటీ హాలు శంఖుస్థాపన కార్యక్రమంలో డాక్టర్ కోడెల శివరామ్ ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు. గత నాలుగున్నరేళ్లుగా నియోజకవర్గ అభివృద్ధికి స్పీకర్ కోడెల కష్టపడి పనిచేస్తుంటే అదే నాలుగున్నరేళ్లుగా ప్రజా సమస్యలు పట్టించుకోకుండా ముఖాలకు పౌడర్ పూసుకుని టీవిలలో కనిపించేవ్యక్తులు ఇప్పుడు ఓట్లకోసం తిరుగుతున్నారని అటువంటి  వ్యక్తులను నమ్మి మోసపోవద్దని సూచించారు. రాముడు లాంటి వ్యక్తి డాక్టర్ కోడెల అయితే రావణాసురుడు లాంటి వ్యక్తి ప్రతిపక్ష నాయకుడు అంబటి రాంబాబు అని డాక్టర్ శివరామ్ విమర్శించారు. నమ్మిన ప్రజలందరూ సంతోషంగా ఉండేందుకు రాష్ట్రంలో ఒక సామాన్య కార్యకర్తగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తర్వాత స్పీకర్ డాక్టర్ కోడెల పనిచేస్తున్నారని తెలిపారు. 21 వవార్డులో ఎక్కువమంది నివేశనా స్థలాలకు పట్టాలు లేకుండా జీవిస్తున్నామని సమస్యకు పరిష్కారం చూపాలని స్థానికులు కోరగా అందుకు స్పందించిన డాక్టర్ శివరామ్ నరసరావుపేటలో 70 సంవత్సరాల నుండి సమస్యాత్మకంగా ఉన్న లింగంగుంట్ల భూములకు స్పీకర్ కోడెల పరిష్కారం చూపారని అలాగే ఇక్కడ కూడా సమస్యకు పరిష్కారం చూపుతారని చెప్పారు. సత్తెనపల్లి పట్టణంలో 50 నుండి 100 పడకలకు ప్రభుత్వ ఆసుపత్రిని అభివృద్ధి చేసారని అలాగే విద్యాపరంగా వెనుకబడిన సత్తెనపల్లిలో కేంద్రీయ విద్యాలయను తీసుకువచ్చారని అన్నారు. క్రీడా అభివృద్ధికి ఒకవైపు స్టేడియం నిర్మిస్తున్నామని అలాగే పిల్లలకు, పెద్దలకు ఆహ్లాదాన్ని పంచేందుకు ఎన్టీఆర్ పార్కు, తారకరామ సాగర్, వావిలాల ఘాట్ లను నిర్మించిన ఘనత కూడా స్పీకర్ కోడెలదేనని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు లోటు బడ్జెట్టులో సైతం 200 రూపాయిల పెన్షన్ను పది రెట్లు పెంచి 2000 రూపాయిలను లబ్దిదారులకు అందిస్తున్నారన్నారు. అలాగే చంద్రన్న పెళ్ళికానుక పధకంలో భాగంగా వివిధ వర్గాల ప్రజలందరికీ 35 వేల రూపాయిల నుండి 50 వేల రూపాయిలను ఇస్తున్న ఘనత కూడా చంద్రబాబుదేనని అన్నారు. వచ్చే ఎన్నికల్లో డాక్టర్ కోడెలను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని డాక్టర్ కోడెల శివరామ్ పిలుపునిచ్చారు. అనంతరం21 వార్డు కౌన్సిలర్ కౌత్రపు సావిత్రి శ్రీనివాసరావు డాక్టర్ కోడెల శివరామ్ ను శ్యాలువాలతో పూలమాలలతో ఘనంగా సన్మానించారు.

👉ఈ సందర్భంగా కౌన్సిలర్ కౌత్రపు శ్రీనివాస్ మాట్లాడుతూ.పెన్షన్ల మంజూరు..వార్డ్ అభివృద్ధి లో స్పీకర్ కోడెల శివప్రసాదరావు, యువనేత డాక్టర్ కోడెల శివరాం అస్సిస్సులతోనే సాధ్యమైంది అన్నారు… పార్టీలకు అతీతంగా పనులు చేయించానని కౌత్రపు సావిత్రి శ్రీనివాస్…అన్నారు…రానున్న ఎన్నికల్లో స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారిని భారీ మెజారిటీతో గెలిపించాలని వార్డ్ ప్రజలకు పిలుపునిచ్చారు

అనంతరం.

👉21 వార్డులో స్వీపర్స్ కాలనీలో కూడా పర్యటించిన యువనేత డాక్టర్ కోడెలశివరామ్

21 వార్డ్ లో స్వీపర్స్ కాలనీ లో పర్యటించి వారి స్థానిక సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో.. చైర్మన్ యెల్లినేడి రామస్వామి,తెదేపా పట్టణాదేక్షుడు చౌట శ్రీను.కో ఆప్షన్ సభ్యులు..మరేళ్ళ మల్లేశ్వర రావు…మార్కెట్ యార్డ్ చైర్మన్ సయ్యాద్ పెద్ద కరిముల్లా,ఆసుపత్రి కమిటీ చైర్మన్ కంబాల వెంకటేశ్వర రావు,టీడీపీ పట్టణ కార్యదర్శి..మస్థానవాలి,19 వార్డ్ కౌన్సిలర్ నందం కబ్బయ్య,17 వార్డ్ కౌన్సిలర్ రాజారావు నరసింహ రావు..తెదేపా నేతలు..వార్డ్ ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు..