పెద్దకూరపాడు

వైయస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయడమే…లక్ష్యం…..వైసీపీ నేతలు లావు కృష్ణదేవరాయ, నంబూరి శంకరరావు


👉ప్రత్యేక హోదా పై పోరాడింది.ఒక్క జగన్ మాత్రమే….నరసరావుపేట పార్లమెంట్ సమన్వయకర్త లావు శ్రీకృష్ణ దేవరాయ

👉పెదకూరపాడు నియోజకవర్గ ప్రజలకు అండగా ఉంటా…పెదకూరపాడు వైసీపీ సమన్వయ కర్త నంబూరి శంకర రావు

👉బీసీలకు అండగా వుండే పార్టీ….వైసీపీనే..గుంటూరు2 సమన్వయకర్త యేసురత్నం..

👉బెల్లంకొండ మండలం…పాపయపాలెంలో….లావు కృష్ణదేవరాయ, నంబురి శంకర రావు సమక్షంలో..
42కుటుంబాలు వైసీపీ లో చేరిక…

మారుతి న్యూస్ పెదకూరపాడు

గుంటూరు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గ పరిధిలో రావాలి జగన్-కావాలి జగన్ కార్యక్రమం…బుధవారం బెల్లంకొండ మండలంలోని పాపయపాలెం గ్రామంలో జరిగింది…ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధులు గా…నరసరావుపేట పార్లమెంట్ సమన్వయ కర్త లావు కృష్ణ దేవరాయ,బీసీనేత గుంటూరు2 సమన్వయకర్త యేసురత్నం, పెదకూరపాడు నియోజకవర్గ సమన్వయకర్త నంబురి శంకర రావు లు హాజరయ్యారు….

ఈ సందర్భంగా….లావు శ్రీకృష్ణ దేవరాయ మాట్లాడుతూ… జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి ని చేయడమే తమ లక్ష్యం అని..వైసీపీ అధికారం లో కి వస్తే…ప్రజలకు మరిన్ని సంక్షేమ పథకాలు పెడుతుంది అన్నారు….ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక హోదా వద్దని…ప్యాకేజీ కావలని…మరల యూ టర్న్ తీసుకుని ఇప్పుడు హోదా కోసం పోరాడుతున్నారని..చంద్రబాబు ను విమర్శించారు… ప్రత్యేక హోదా కోసం పోరాడిన ఓకే ఒక్కడు…జగన్ మాత్రమే నని అన్నారు..

బీసీ నేత… యేసురత్నం మాట్లాడుతూ…బీసీలపై తెదేపా ప్రభుత్వం… కపటప్రేమ చూపుతుందని…బీసీ లకు వైసీపీ పెద్దపీట వేస్తోందని… కాబట్టి బీసీలు వైసీపీ ని బలపరచాలని ఆయన కోరారు

పెదకూరపాడు సమన్వయకర్త నంబూరి శంకర రావు మాట్లాడుతూ….పెదకూరపాడు నియోజకవర్గ పరిధిలో స్థానికంగా అభివృద్ధి జరగలేదని…ప్రజలు స్థానిక పాలన పట్ల వ్యతిరేకంగా వున్నారని..అని శంకరరావు అన్నారు…..పెదకూరపాడు ప్రజలకు తాను అండగా ఉంటానని…పెదకూరపాడు నియోజకవర్గంలో నన్ను,నరసరావుపేట పార్లమెంట్ కి లావు శ్రీకృష్ణ దేవరాయను… గెలిపించి జగనన్నను… ముఖ్యమంత్రి ని చేద్దాం అంటూ…ప్రజలను కోరారు

తొలుత…రావాలి జగన్ కావాలి జగన్ భాగంగా..పాపయపాలెం గ్రామంలో….
ఇంటింటికీ తిరిగి.. వైస్సార్ నవరత్న సంక్షేమ పథకాలు పై అవగాహన కల్పించారు…

వైసీపీ లో చేరికలు…

అనంతరం… పాపయపాలెం గ్రామంలో…సుమారు 42 కుటుంబాలను…వైసీపీ లో ఆహ్వానించి.. వారికి కాండవాతో.. పార్టీ లో చేర్చుకున్నారు

…ఈ కార్యక్రమంలో… నరసరావుపేట సమన్వయకర్త లావు కృష్ణ దేవరాయ,బీసీ నేత యేసురత్నం, పెదకూరపాడు సమన్వయకర్త…నంబూరి శంకర రావు తో పాటు..బెల్లంకొండ మండల పరిషత్ అధ్యక్షులు..చెన్నపరెడ్డి పద్మ వెంకటేశ్వరరెడ్డి
బెల్లంకొండ జడ్పీటీసీ దేవళ్ళ రేవతి …మరియు మండల వైసీపీ నేతలు, గ్రామ వైసీపీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు