సత్తేనపల్లి

“చిట్టా” ను కలిసిన తాడికొండ వైసీపీ సమన్వయకర్త..డాక్టర్ శ్రీదేవి

👉సత్తెనపల్లి లో సీనియర్ న్యాయవాది…చిట్టా విజయ భాస్కర్ రెడ్డి ఇంటికి తాడికొండ వైసీపీ సమన్వయం కర్త డాక్టర్ శ్రీదేవి

👉తనకు సహకరించాలని కోరిని డాక్టర్ శ్రీదేవి

మారుతి న్యూస్ సత్తెనపల్లి

సత్తెనపల్లి పట్టణానికి చెందిన సీనియర్ న్యాయవాది, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ చిట్టా విజయభాస్కర్ రెడ్డి ని వైసీపీ తాడికొండ సమన్వయ కర్త డా. శ్రీదేవి మర్యాద పూర్వకంగా కలిసారు. చిట్టా నివాస గృహంలో ఆమె రెండు గంటలు సమావేశమయ్యారు. చిట్టా స్వగ్రామం ఫిరంగిపురం మండలం రేపుడి కావడంతో ఆమె చిట్టాను కలిసి తాడికొండ నియోజకవర్గ రాజకీయం పై చర్చలు జరిపారు..
రేపూడి గ్రామ సర్పంచిగా చిట్టా పెద్ద సోదరుడు చిట్టా కృష్ణ జ్వాలరెడ్డి, చిన్న సోదరుడు అయిన బాపూజీ రెడ్డి నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ డిస్ట్రిబ్యూటరి కమిటీ సభ్యునిగా కొనసాగుతున్నారు. గతంలో మార్కెట్ యార్డ్ ఛైర్మన్ గా పని చేశారు. ఈ నేపథ్యంలో ఫిరంగిపురం మండలంలోని బంధుత్వం అర్థ బలం, అంగ బలం ఉన్న చిట్టా విజయ భాస్కర రెడ్డి సహకారం ఉంటే ఫిరంగిపురం మండలంలో మంచి మెజారిటీ సాధించవచ్చని భావనతో శ్రీదేవి చిట్టాను కలిసినట్లు సమాచారం. ఇందులో భాగంగా
శ్రీదేవి భర్త డాక్టర్ కె. శ్రీధర్ కూడా ఈ సమావేశంలో పాల్గొని తమకు సహకరించాలని కోరారు. అందుకు స్పందించిన చిట్టా తమ స్వగ్రామం అయిన రేపూడి తో పాటు మండలంలోని పలు గ్రామాల నాయకులు అనుచరులు, మద్దతుదారులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని తెలిసింది. తొలుత సత్తెనపల్లి నియోజకవర్గ వై సిపి బాధ్యత ను మోసిన చిట్టా అంబటి రాకను విభేదించి వై సిపి కి దూరంగా వుంటున్నారు.గత కొంతకాలంగా రాజకీయలకు దూరంగా ఉంటున్న చిట్టా నివాసానికి…..తాడికొండ వైసీపీ సమన్వయకర్త..డాక్టర్ శ్రీదేవి రావడం పట్టణంలో రాజకీయంగా చర్చనీయాంశంఅయ్యింది..ఈ సమావేశంలో ఫిరంగిపురం, మెడికొండూరు వైసీపీ నేతలు పాల్గొన్నారు…