సత్తేనపల్లి

మోడీ,కేసీఆర్, జగన్ కు ఓటు అనే ఆయుధం తో బుద్దిచెప్పాలి… సత్తెనపల్లి లో సీఎం చంద్రబాబు

మారుతి న్యూస్ సత్తెనపల్లి

ఎన్నికల చివరి రోజు సీఎం చంద్రబాబు సత్తెనపల్లి లో స్పీకర్ కోడెల, ఎంపీ రాయపాటి కి మద్దతు గా..సత్తెనపల్లి తాలూకా సెంటర్ ప్రచార రోడ్ షో లో పాల్గొన్నారు..

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ..

న్నికల సంఘం మోదీ ఆధ్వర్యంలో పని చేస్తుంది – సీబీఐని దుర్వినియోగం చేశారు, ఈడీతో దాడుల చేయించారు – ఇప్పుడు ఈసీని భృష్టు పట్టిస్తున్నారు – నా పోరాటం మీ భవిష్యత్తు కోసం – నాకు మీ అండ కావాలి.. మీరందరూ కలిసి రావాలి – కేసీఆర్ ఒక నియంత, ఊసరవెల్లి రాజకీయాలు చేస్తారు – ప్రత్యేక రాష్ట్రం ఇస్తే కాంగ్రెస్ లో పార్టీని విలీనం చేస్తానని తర్వాత మాట మార్చారు – హైదరాబాద్ ని మనమే అభివృద్ధి చేశాం – మనకు రావాల్సిన వాటాను కూడా ఇవ్వడం లేదు – కేసీఆర్ భయపెడితే భయపడను – మోదీ, కేసీఆర్, జగన్ కలిసిపోయారు – కేసీఆర్, మోదీ వైసీపీకి డబ్బులు పంపించారు – ఆ డబ్బులు రాష్ట్రాభివృద్ధి ఆపడానికి, మనల్ని ఓడించడానికి పంపారు – జగన్ కేసులు కోసం మాత్రమే పోరాడతారు – కేసీఆర్, జగన్.. మోదీ పెంపుడు కుక్కలు – ఇంటికి పెద్దకొడుకుగా ఉంటా అని మాట ఇచ్చి నిలబెట్టుకున్నా – కోటి మంది చెల్లెమ్మలు ఉన్న అన్నయ్యను – మీరు సౌభాగ్యంగా ఉండాలని రెండుసార్లు పసుపుకుంకుమ ఇచ్చాను – తెలంగాణలో పసుపుకుంకుమ ఇవ్వలేదు – భవిష్యత్తులో ప్రతి సంవత్సరం పసుపుకుంకుమ ఇస్తాను – రైతులకు 4వ విడుత రుణమాఫీ ఇచ్చాను – కేసీఆర్ కి పొగ వేసి బయటకు లాగా – నన్ను సన్నాసని తిడుతున్నాడు.. కేసీఆర్ గొప్ప నాయకుడా? – కేసీఆర్ ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి – నా జోలికి వస్తే తాటతీస్తా – కేసీఆర్, మోదీకి బుద్ధి రావాలంటే వాళ్ల భాషలోనే మాట్లాడాలి –

ఎంత మంది కలిసినా మన సంకల్పాన్ని ఏంచేయలేరు – మన ఆస్తులను కొట్టేసి హోదాకు నేను అడ్డం కాదంటున్నారు – పార్లమెంట్ లో హోదా కోసం పోరాడుతుంటే అవిశ్వాస తీర్మానం జరగకుండా కేసీఆర్, అన్నాడీఎంకే ఆపారు – సోనియా హోదా ప్రకటిస్తే.. మాకూ ఇవ్వాలని కేసీఆర్ అన్నారు – కేసీఆర్ పార్టనర్ జగన్ కి డిపాజిట్లు కూడా రావు – కేసీఆర్ రాష్ట్రానికి వస్తే గిఫ్ట్ ఇచ్చే వాడిని – ఆయనకు ఏం సంబంధం ఉందని వైసీపీకి డబ్బులు పంపించావు – కృష్ణా నీళ్లు మనకు ఇవ్వరంటా..డెల్టా ఔట్ సైడ్ బేసిన్ లో ఉందన్నారు – వెలుగొండ, పోతిరెడ్డిపాడు, ముచ్చుమర్రి మూసేయాలని అన్నారు – పోతిరెడ్డిపాడు వలన సీమకు నీళ్లు వెళ్తున్నాయి – జగన్ కి రోషం లేదు.. 24 గంటలు కేసుల గోలే – జగన్ అసెంబ్లీకి 24 రోజులు.. కోర్టుకు 240 రోజులు వేళ్లారు.. ఇలాంటి నాయకుడు మనకు అవసరమా? – నూతన ఆంధ్రప్రదేశ్ కి మొదటి స్పీకర్ గా కోడెల శివప్రసాద్ ను నియమించాం – వెనుకబడిన వర్గాలు ఎప్పుడూ తెలుగుదేశం వెంటే – పెన్షన్ రూ.3 వేలకు పెంచుతాం.. దేవుడి కరుణిస్తే ఇంకా పెంచుతాం – జాబు రావాలంటే బాబు మళ్లీ మళ్లీ రావాలి – 31 కేసులు ఉన్న వ్యక్తి, వారానికి ఒకసారి కోర్టుకి వెళ్లే వ్యక్తిని చూసి పరిశ్రమలు వస్తాయా? – నిరుద్యోగ భృతికి అర్హత ఇంటర్ చేస్తాం – ప్రపంచంలో గొప్ప పారిశ్రామికవేత్తలను తెచ్చి నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తా – అమ్మ వందనం ద్వారా పిల్లలను బడికు పంపిస్తే సంవత్సరానికి రూ.18వేలు ఇస్తాం – టీడీపీ అధికారంలోకి వస్తే ముస్లింలకు ఉపముఖ్యమంత్రి పదవి ఇస్తా – ఇమామ్..మౌజమ్ లకు జీతాలు పెంచాం – జగన్ కు ఓటేస్తే మోదీకి వేసినట్లే – అస్సాంలో ముస్లింల ఓట్లు తీసేశారు.. భవిష్యత్తులో దేశమంతా తీసేసే అవకాశం ఉంది – ఈసీ స్వయంప్రతిపత్తి లేకుండా చేస్తుంది – ఓట్లు తొలగిస్తుంటే అడ్డుకున్నాను – నేరస్థులను కాపాడుతూ.. మన సీఎస్, డీజీ లను బదిలీ చేస్తారు..

వారికి ఎవరు ఇచ్చారు అధికారం – మిషన్లను ఏమార్చి గెలవాలనుకుంటున్నారు.. అలా చేస్తే శాశ్వతంగా జైళ్లకు వెళ్తారు – ఓటు వేసిన తర్వాత వీవీప్యాట్ లను పరిశీలించండి – వీవీప్యాట్ లను లెక్కించడానికి సమయం పడుతుందంటూ నాటకాలు ఆడుతున్నారు – టీడీపీ ముసుగులో ఆరాచకాలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు.. డబ్బులు పెట్టి ఓట్లను కొనాలనుకుంటున్నారు – ఏపీలో డబ్బులకు అమ్ముడుపోయే వారు లేరు.. మా జన్మభూమికి ఎవరు అన్యాయం చేయరు – పిచ్చిపిచ్చి పనులు చేస్తే మీ డబ్బులతో సహా.. మీ ఆటలు కట్టిస్తాం – శాంతిభద్రతలు కాపాడతాం – సత్తెనపల్లి రాష్ట్రానికి ఆదర్శం కావాలి.. అభివృద్ధి చేశాం.. ఎన్నికలలో కూడా రాష్ట్రానికి ఆదర్శంగా నిలవాలి – ఒక్క అవకాశం ఇవ్వాలని జగన్ అంటున్నారు – అవకాశం ఇస్తే పోలవరం.. రాజధాని ఆగిపోతాయి..శ్రీశైలం, నాగార్జునసాగర్ కేసీఆర్ చేతిలోకి పోతాయి.. పోతిరెడ్డిపాడు, ముచ్చుమర్రి మూతపడతాయి – జగన్ కి దేనికి ఇవ్వాలి అవకాశం.. కేసుల మాఫీ కోసమా? కేసీఆర్ కి బాంచన్ అని ఆయన కాళ్లు కడిగి నీళ్లు చల్లుకుంటావా – వైసీపీ నేతలు రూ.2వేలు రూ.3 వేలు పెంచుతుంటూ ఈసీ ఏం చేస్తుందో అర్ధం కావడం లేదు – న్యాయంగా పసుపుకుంకుమ, అన్నదాత, రుణమాఫీ ఇస్తున్నా.. అవినీతి సొమ్ము మనకు అవసరమా?

– కేసీఆర్ ఏం చేయకున్న 88 సీట్లు గెలిచారు.. ఇన్ని చేసినా మనం ఎన్ని గెలవాలి – దేశంలో అన్ని రాష్ట్రాల కంటే మిన్నగా ఏపీని తీర్చిదిద్దుతా – మీ కోసం మోదీతో పోరాడా.. కేసీఆర్ దగ్గర నేను తలదించుకునేలా చేస్తారా? – సీట్లు తగ్గితే మనం తలదించుకునే పరిస్థితి వస్తుంది – మన డబ్బులు తీసుకుని.. ఏం చేయకున్నా కేసీఆర్ కి 88 సీట్లు వచ్చాయి – మీరు పౌరుషంతో 175 సీట్లు గెలిపించాలి.. కేసీఆర్ గుండెల్లో రైళ్లు పరిగెత్తించాలి.. మన జోలికి రావాలంటే భయపడాలి – కోడికి ఉన్న కత్తి తీసేసి.. మీరు ఈకలు అన్ని పీకేస్తే..ఆ కోడి ఇక తిరగదు.అని జగన్ ఉద్దేశించి చంద్రబాబు అన్నారు.

కార్యక్రమంలో… స్పీకరు కోడెల శివప్రసాదరావు తో పాటు..ఎంపీ రాయపాటి సాంబశివరావు, టీడీపీ నేతలు, కార్యకర్తలు.. మహిళలు, ప్రజలు పాల్గొన్నారు…