సత్తేనపల్లి

మోడీ ఎన్ని కుట్రలు పన్నిన అంతిమ విజయం చంద్రబాబుదే… ఎం.పి. రాయపాటి

•మారుతి న్యూస్ సత్తెనపల్లి:-

కేసిర్., వైయస్.జగన్, జనసేన అధినేత పవన్ కళ్యాణలతో కలుపుకొని మోడీ ఎన్ని కుట్రలు పన్నిన ప్రజలు అభివృధికి పట్టం కట్టేందుకు చంద్రబాబునే గెలిపిస్తారని ఎం.పి. రాయపాటి పేర్కొన్నారు. సోమవారంనాడు ఆయన సత్తెనపల్లి నియోజక వర్గంలోని ముప్పాళ్ళ మండలంలోని నార్నెపాడు గ్రామంలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎం.పి. రాయపాటి మాట్లాడుతూ

రాష్ట్ర విభజన అనంతరం మన రాష్ట్రానికి కేంద్రం నుండి న్యాయపరంగా రావాల్సిన నిధులు మోడీ ఇవ్వక పోయిన 2014 ఎన్నికల్లో మన రాష్ట్రానికి ఇస్తానన్న హామీలు మోడీ విస్మరించిన,, ముఖ్యమంత్రి చంద్రబాబు తనకున్న అపార మేధా శక్తితో రాజకీయ అనుభవంతో రాష్ట్రాన్ని అభివృధి పధంలో నడిపిస్తున్నారని ఎన్నికల ప్రచారంలో తమకు వేశేష స్పందన లభిస్తున్నదని మరల చంద్రబాబుని పట్టం కట్టేందుకు ప్రజలు సిధంగా ఉన్నారని రాయపాటి పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాయపాటి చేసిన అభివృధి కార్యక్రమాలను వివరిస్తూ….
• గుంటూరు – నడికూడి సెక్షన్ లో భీమవరం, రాజుపాలెంతో పాటు పలు గ్రామాలలో Unmanned level crossings మూసివేసిన కారణంగా, రైతాంగం ఇబ్బంది పడుతుంటే అండర్ పాస్ బ్రిడ్జీలు ఏర్పాటు చేస్తున్నాం


• నడికూడి – శ్రీకాళహస్తి రైల్వే మార్గంలో తొలిదశ పనులు శావల్యాపురం పనులు పూర్తయ్యాయి. సత్తెనపల్లి నియోజకవర్గ పరిధిలో సకరికల్లు, కుoకలగుంటలలో నూతన రైల్వే స్టేషన్లు నిర్మితమయ్యాయి.
• వినుకొండ, గురజాల, మాచర్ల – 600 కోట్ల వాటర్ గ్రిడ్ లు
• అనువు, కొప్పునూరు ఎత్తిపోతల పధకం – 100 కోట్లు పదివేల ఎకరాలు
• దుర్గి మార్కెట్ యార్డు
• ధర్మవరం గ్రామం దత్తత 2 కోట్లతో అభివృద్ధి . 36 కోట్లతో 3600 ఎకరాలకు సాగునీటిని అందించే ఎత్తిపోతల పధకం
• 36 కోట్ల CSR నిధులు
• వరికేపూడిసెల ఎత్తిపోతల పధకం 25 వేల ఎకరాల 340 కోట్లు మంజూరు చేసిన మఖ్యమంత్రి
• మాచర్లలో 80 కోట్లు, వినుకొండలో 159 కోట్లు, ( Towns ) పిడుగురాళ్ళలో 96 కోట్లతో త్రాగునీటి పధకాలు మంజూరు
• Industries Park, Agriculture, Veterinary Universities ఏర్పాటుకు
• పేరేచర్ల – కొండమోడు రహదారి నాలుగు వరసలుగా విస్తరణకు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చద్రబాబునాయుడు చేతుల మీదుగా శంకుస్థాపన జరిగింది త్వరలో పనులు ప్రారంభిస్తాo.
• గోదావరి – పెన్నా నదుల అనుసంధానం తొలిదశ 6300 కోట్ల రూపాయిలతో హరిశ్చంద్రపురం నుండి నకరికల్లు వద్ద నాగార్జునాసాగర్ కుడి కాల్వకు నీటిని ఎత్తిపోస్తారు. భూసర్వే పూర్తయ్యింది. త్వరలో భూ సేకరాణ పూర్తి చేసి పనులు ప్రారంభిస్తాం కుడి కాల్వ క్రింద ఉన్న 9 లక్షల ఎకరాల ఆయకట్టు స్ధిరీకరణ జరగడంతో పాటు, వందలాది గ్రామాలకు త్రాగునీరు అందుతుంది.
• గోదావరి – కృష్ణా నదుల అనుసంధానo (పట్టి సీమ) కారణంగా కృష్ణా డెల్టా ఆయకట్టు పరిధిలోని 13 లక్షల ఎకరాల స్థిరీకరణ జరిగింది.


• సత్తెనపల్లిలో కేంద్రీయ విద్యాలయం మంజూరు చేయిoచాము.
• నరసరావుపేటలో జెన్ టి యు ఇంజనీరింగ్ కళాశాల మంజూరు చేయిoచాము.
• సత్తెనపల్లి – క్రోసూరు రహదారిలో 70 కోట్లతో ఓవర్ బ్రిడ్జి మంజూరు చేపించానని ఎంపీ రాయపాటి తెలిపారు..
నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్థి గా తనకు,సత్తెనపల్లి అసెంబ్లీ అభ్యర్థి గా కోడెల శివప్రసాదరావు కు సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను ఎంపీ రాయపాటి అభ్యర్ధించారు..ఈ కార్యక్రమంలో తెదేపా నాయకులు ,కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు