నరసరావుపేట

బీసీల సంక్షేమనికి తెదేపా కట్టుబడి ఉంది ఎంపీ రాయపాటి..ఎమ్మెల్యే అభ్యర్థి చదలవాడ

మారుతి న్యూస్ నరసరావుపేట

గుంటూరు జిల్లా నరసరావుపేటలోని జమిందార్ ఫంక్షన్ హాల్లో బీసీల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నా నరసరావుపేట టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి రాయపాటి సాంబశివరావు మరియు అసెంబ్లీ అభ్యర్థి డా. చదలవాడ అరవింద్ బాబు.
నరసరావుపేటలోని జమిందార్ ఫంక్షన్ హాల్లో బీసీల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నా

నరసరావుపేట టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి డా. చదలవాడ అరవింద బాబు మాట్లాడుతూ

నరసరావుపేట ప్రజలకు ఒక డాక్టర్ గా తానూ చేసైనా సేవలను గుర్తించి బిసిలు అందరు తనకు మద్దతునివ్వటం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేసారు. తానూ బిసి కులానికి చెందిన వాడినప్పటికీ అన్ని కులాలకు చెందిన వారు తనకు మద్దతు నివ్వటం ఏంటో సంతోషాన్ని కలిగిస్తుందని అన్నారు. టీడీపీ తరపున బీసీలకు ప్రెవేశపెట్టిన సంక్షేమ పథకాలయొక్క ఫలాలను అందరికి అందేలా, బీసీల అభివృద్ధికి తన వంతు కృషిని చేస్తానని తెలియచేసారు.


అనంతరం నరసరావుపేట టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి రాయపాటి సాంబశివరావు మాట్లాడుతూ

చంద్రబాబు ప్రభుత్వంలో బిసిలకు పెద్దపీట వేశారని బీసీల సంక్షేమానికి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కట్టుబడి ఉంటుందని 2019 ఎన్నికలలో నరసరావుపేట నుండి పార్లమెంట్ అభ్యర్థిగా బరిలో ఉన్న తనకి బీసీలు తమ మద్దతును తెలియచేసి తనను గెలిపించాలని కోరారు. బీసీలకు కమ్యూనిటీ హాల్స్ తో పాటు వివిధ సంక్షేమ పథకాలు కేంద్ర ప్రభుత్వ సహాయంతో అందరికీ అందేలా చూస్తానని అన్నారు.మొదటి నుండి బీసీలు తెదేపా కి అండగా ఉన్నారని రాయపాటి గుర్తు చేశారు.బీసీ కులాలు అన్నింటికీ కార్పొరేషన్ లు ఏర్పాటు చేసిన ఘనత చంద్రబాబు కె దక్కింది అని ఎంపీ రాయపాటి అన్నారు..ఎప్రిల్ 11 న జరుగుతున్న ఎన్నికల్లో.. ఎంపీ,ఎమ్మెల్యే అభ్యర్థులు గా పోటీచేస్తున మాకు సైకిల్ గుర్తు పై ఓటు వేసి అండగా నిలవాలని బీసీల కు రాయపాటి పిలుపునిచ్చారు