సత్తేనపల్లి

స్పీకర్ కోడెలకు మద్దతు గా సత్తెనపల్లి పట్టణంలో తెలుగు యువత ఆధ్వర్యంలో భారీ ర్యాలీ..

మారుతి న్యూస్ సత్తెనపల్లి

గుంటూరు జిల్లా సత్తెనపల్లి పట్టణంలో డాక్టర్ కోడెల శివప్రసాదరావుకు మద్దతుగా తెలుగు యువత ఆధ్వర్యంలో భారీ ర్యాలీ.

సత్తెనపల్లి చెక్ పోస్ట్ నుండి తారకరామా సాగర్ మీదుగా సత్తెనపల్లి టీడీపీ పార్టీ కార్యాలయం వరకు భారీ ర్యాలీ

కోడెల నామంతో పచ్చ జెండాలతో మారుమోగిన సత్తెనపల్లి పుర వీధులు

ఈ సందర్భంగా.. యువనేత కోడెల శివరాం మాట్లాడుతూ..

ఈ ర్యాలీ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది.

ఆదివారం అయినా పార్టీ పిలుపునిచ్చిన 2గంటల సమయంలో ఇంత పెద్ద ర్యాలీ చేయడం సంతోషంగా ఉంది.

కార్యకర్తలు ఏ విధంగా పార్టీకి అండగా ఉంటున్నారో… పార్టీ, సీఎం చంద్రబాబు, కోడెల అదేవిధంగా పార్టీకి అండగా ఉంటారు.

72సంవత్సరాల వయస్సులోను మండుటెండ, చీకటి లెక్కచేయకుండా కోడెల ప్రచారం ప్రతిపక్షాలను బెంబేలెత్తిస్తుంది.

కోడెల చేసిన అభివృద్ధితో నేడు నియోజకవర్గంలో ఏ గ్రామానికి వెళ్లిన ప్రజలు పెద్ద ఎత్తున బ్రహ్మరథం పడుతున్నారు.

నేను మీలో ఒకడిగా ఒక హమీ ఇస్తున్నాను.

మీకు ఏ కష్టం వచ్చిన కోడెల కుటుంబం, పార్టీ ఎప్పుడు మీకు అండగా ఉంటుంది.

ప్రతిపక్ష పార్టీలు అబద్దపు హమీలతో తప్పుడు ప్రలోభాలతో ముందుకు పోతున్నారు.

మనం అభివృద్ధే ప్రధాన అజెండాగా ముందుకు వెళుతున్నాం.

కార్యకర్తలు ఉత్సాహంతో ముందుకు వెళ్లాలి.

కోడెల ఎక్కడ ఉంటే అక్కడ అభివృద్ధి, సంక్షేమం కార్యకర్తలకు అండా ఉంటుంది.

11న పోలింగ్ అయిపోయే వరకు ఇదే ఉత్సాహంతో కార్యకర్తలు ముందుకు వెళ్లాలి.

కార్యకర్తలు, నాయకుల మధ్యలో ఏమైనా చిన్న చిన్న విభేదాలు ఉంటే పక్కన పెట్టాలి.

రాబోయే 5సం మీకు అండగా ఉంటాం.అని యువతను ఉద్దేశించి అన్నారు

9న సీఎం చంద్రబాబు సత్తెనపల్లి పట్టణానికి వస్తున్నారు.

తెలుగు యువత ఆధ్వర్యంలో ఆరోజు భారీ ర్యాలీ ఉంటుంది.

కార్యకర్తలు, నాయకులు అందరూ కలసి సీఎం రోడ్ షో విజయవంతం చేయాలి అని కోడెల శివరాం పిలుపునిచ్చారు